Technology allsmartarticles.com

సాంకేతిక జ్ఞానం మనుషులను  దూరం చేస్తుందా ? లేక దగ్గర చేస్తుందా – by G. Suresh Kumar

Technology   అంటే ఒక Creativity,  Creativity నుండి సృష్టిoచబదినదే    Technology మనవుని యొక్క పనులను    సులభతరం చేసుకునేందుకు మనం సృష్టించుకన్నదే  Technology  అని చెప్పవచ్చు.

మానపుడు రాతియుగం నుండి మొదలుకొని ప్రస్తుతయుగం వరకు దినదినాభివృద్ధి చెందుతోనే ఉన్నాడు.

ఆప్పటి నుండి ఇప్పటి వరకు  Technology ఉహించని  మార్పులు ఎన్నో, ఎన్నెన్నో “అంగట్లో అన్ని ఉన్న, అల్లుని నోట్లో శని “” అన్నట్లు ఈ సాంకేతిక జ్ఞానం మనుషులను  దూరం చాస్తుందా ? లేక దగ్గర చేస్తుందా అనే సందేహం ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ఒక్కరికి రావడం ఎలాంటి అతిశయోక్తి లేదు.

మానవుడు  ఎప్పుడు  తను చేసే పని ఉన్నతంగా ఉండాలని ఆ ఆశిస్తుంటాడు.  ఇటువంటి ఆశయమే మానవునికి తన జీవితంలో ఆనేక రకాల నూతన అన్వేషణ లకు ఆవిస్కరణ లకు బీజం పడింది. Technology  ఆభివృద్ధిలో భాగంగా మానవుడు  తన ఆ హారాన్ని తను తాయారు చేసుకోవడానికి వ్యవసాయం ఎలా చేయాలో నేర్చుకున్నాడు. పోలం దున్నడానికి మొదట మనుషులే కావడిని ఎత్తుకొని దున్నేవారు. తరువాత  నాగళ్ళు, ఆతరూవాత  ట్రాక్టర్ లతో డున్నడం ప్రారంభించారు.

 

“కోత్తోక వింత పాతొక రోటా ఆన్నట్లు”

ప్రతిఒక్కరు నూతన పద్దతులతో  వచ్చిన  మిషన్లను ఉపయోగించి నారు నాటడం, పంటకోయడం, ధాన్యాన్ని తీయడం  ప్రతీ పనికి మిషన్లను  ఉపయోగించి సమయాన్ని అదా చేసుకొని అధిక దిగుబడిని పొందుతున్నారు. చాల ఎకరాలు సాగు చేసే వ్యవసాయ దారునికి ఈ యంత్రాల ద్వారా అధిక లాభం కలుగుతుంది. సామాన్య రైతు అనగా కొద్దిపాటి వ్యసాయం చేసే వ్యక్తి “ఏటికి ఎదురీత ఈది నట్లు” పనిచేసే కులీలు ప్రస్తుత పరిస్తితులలో దొరకక, దొరికిన వారికి అందరికి కూలి    చెల్లించక,  యంత్రాలకు  అత్యంత కూలి  చెల్లించలేక, వేచ్చించినా అప్పులు చేసి చివరికి కొంత మంది రైతులు పంటను నష్టపోయి   ఆత్మహత్యలకు పాల్పడుతున్న వార్తలను మనం వింటున్నాం.

ప్రభుత్వం  రైతులకోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినప్పటికి  ఋణసదుపాయాలు కల్పించి  ఋణమాఫీ చేసినప్పటికీ  “ఆందని ద్రాక్ష పండ్లు  పుల్లన”  ఆన్నట్లు  కొంతమంది రైతులకు   – ఆ పథకాలు చేరడం లేదు. Technology  ఎంత గానో అభివృద్ధి చెందినప్పటికి , కొతమంది రైతులు  నూతన పద్ధతులు ఆనుసరించక ఎన్నో కష్టనష్టాలు   ఎదుర్కోంటు న్నారు. దీనిని బట్టి Technology  మనుషులను  – దూరం   చెస్తుందా? లేదా దగ్గర చెస్తుందా ? అనే విషయాన్ని అర్థం  చేసుకోవచ్చు.

ఒక ప్పుడు పండించిన పంటలలో ఎటువంటి మందులు వాడేవారు కాదు

ప్రస్తుతం  పండిస్తున్న   పంటలలో ఎక్కువ శాతం రసాయనిక ఎరువులను ఉపయోగించి  పండి స్తున్నారు. పురాతన పద్ధతిలో ప్రతి ఇంటి పెరటిలో పెంటకుప్పలు ఉండేవి ఆకుప్పలలో ఆ ఇంటి యొక్క చెత్త, చెదారం,పేడ మరియు ఇతర పదార్థాలు అన్ని వేసే వారు.  ఆ పెంటకుప్పలు తీసుకొనిపోయి పంటపొలాల్లో చల్లడం వలన అవి మంచి ఎరువు గా పంటపొలాలకు ఉపయోగపడేవి. అప్పటి ఆహారాన్ని తిన్న వ్యక్తులు ఆరోగ్యంగా ఎన్నో సంవత్సరాలు జీవించగలిగారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఈ మందులు చల్లిన ఆహారం తినడం వల్ల తొందరగా ఆనాణోగ్యానికి గురై,  ఎటువంటి Hard work చేయలేకపోతున్నారు. ఒకప్పుడు  చెట్టు వీద పండిన పండడ్లు లబించెవి . అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవి ప్రస్తుత పరిస్థితులలలో  వినూత్న పద్ధతిలో మరియు సంకర జాతి  కోత్త కొత్త మేలి  వంగాల పండ్లను మందులను ఉపయోగించి పండిచడం వల్ల  , ఆ పండ్లను తిన్న వ్యక్తులు వివిధ రకాల రోగాలకు గురై  అనారోగ్యాన్ని పొంది, ఎక్కువ కాలం జివించలేకపోతున్నారు. ఒకప్పుడు పండ్లు ఆరోగ్యానికి మంచివి. అని చెప్పిన డాక్టర్ ఈరోజు ఆ పండ్లను తినలేని పరిస్తితి . దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు Technology  మనుషులను  – దూరం   చెస్తుందా? లేదా దగ్గర చెస్తుందా ? అని.

 

ఒకప్పుడు మనిషి తన ఆహారంగా పండ్లు, పచ్చి కూరగాయలు, కందమూలాలు తిని జీవించేవాడు.

నాగరిక అభివృద్ధి చెంది వంట చేయడం నేర్చుకున్నాడు.  అప్పుడు వంట అనేది ఆవుల పేడతో చేసిన పిడకలతో మరియు కట్టెలతో చేసేవాడు. ఆనాటి రుచి ఎంతో బాగుండి మనసుకు చాల ఆనదాన్ని మరియు  ఆహ్లాదాన్ని ఇచ్చింది . ఆ తరువాత కిరోసీన్ స్టవ్ లు, గోబర్ గ్యస్ లు, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్లు ఇలా Technology అభివృద్ధి చెంది రైస్ కుక్కర్ లోని భోజనాన్ని భుజిస్తూ అన్ని రకాల విటామిన్లు మరియు పోశక పదార్థాలు నష్టపోయి కేవలం మనం బ్రతకడాని కోసమే, ఈ ఆహారాన్ని భుజిస్తున్నామా, ఆనారోగ్యం అని తెలిసి కూడా ఎటువంటి ఆహారాన్ని భుజించి, సంపాదించిన    మొత్తాన్ని డాక్టర్ ల దగ్గర ఖర్చు పెట్టి, ఈరోజు డాక్టర్లను తొందరగా ధనవంతులుగా తయారుచేస్తున్నాము.

 

విద్యారంగంలో ఒకప్పుడు ఉరికి దూరంగా అరణ్యం లో గురుకులాలు ఉండేవి.

రాజ కుమారులనుండి సామాన్యుల వరకు అదే    గురుకులాలలో తమ విద్యబ్యాసాన్ని కొనసాగిస్తూ, భూమి మీదనే అక్షరాలను దిద్దుతూ, వల్లెవేసే పద్దతి ద్వారా జ్ఞానాన్ని ఆర్జించేవారు. తమ ఆహారంకోసం బిక్షాటన చేసి ఆహారాన్ని భుజించేవారు. ఆలా నాగరికత అభివృధి చెంది ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు మరియు కార్పోరేట్ పాఠశాలల్లో  విద్యార్థులు విద్యాబుద్దులు నేర్చుకుంటున్నారు. ఈ రోజు పలక బలపాన్ని ప్రక్కకు పెట్టి Smart Slates అని , Computers అని, Online Education అని , Internet ద్వరా ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందని క్షణాల్లో చూడగలుగుతున్నారు. భూమి నుండి అంతరిక్షానికి రాకెట్లో వెళ్లి అక్కడ నివశించడానికి   గల అవకాశాలను వెతుకుతున్నారు. రాకెట్ల సహాయంతో కూడా శత్రువు లను నాశనం చేస్తున్నారు.

 

ప్రస్తుత రోజుల్లో TV లేని, Mobile లేని ఇల్లు లేదంటే అది అతిశయోక్తి కాదు

“గుడ్డెద్దు చెనులోపడినట్లు” ఈ రోజుల్లో విద్యార్ధి Mobile Phone లో ఆడుకుంటూ, whatsapp చాటింగ్ చేస్తూ తమ అమూల్యమైన కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ తమ బంగారు జీవితాన్ని చేజేతులా కోల్పోవుచున్నారు. “అగ్నికి ఆజ్యం పోసినట్లు” ఈ మద్య మనం వార్తల్లో గమనించినట్లైతే కొంత మంది ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు  టిక్ టాక్ లు చేస్తూ తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నవారు ఉన్నారు. ఈరోజుల్లో మనపిల్లలు మన మాట వినడం లేదని గొప్పగా చెప్పుకుంటున్నాము. వాస్తవానికి పిల్లవానికి     గోరుముద్దలు తినిపించడానికి ఒకప్పుడు చందమామ రావే …జాబిల్లి రావే … అని పాటలు పాడుతూ తినిపించేవారు. ప్రస్తుతపరిస్తితుల్లో తమ పిల్లవానికి గోరుముద్దలు తినిపించడానికి ప్రతి అమ్మ తమ Mobile ను పిల్లవాని చేతులో పెట్టి, హమ్మయ్య ఒక పని అయిపోయిందని అనుకుంటున్నారు. చిన్నప్పుడే ఇలా Mobile ను అలవాటు చేసి, కనీస చూచనలు ఇవ్వకుండా పెద్దగా అయిన తరువాత ఆ పిల్లవాడు Mobile ను వదిలిపెట్టడం లేదని చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నదని ఈ రోజు ఆ పిల్లవాన్ని తల్లి తండ్రులు అనరాని మాటలు అంటున్నారు. ఇలా చెడిపోవడానికి ఎవరు భాద్యులు ఒకసారి మనం అలోచించి నట్లయితే మనకు అర్థం అవుతుంది.

 

ప్రస్తుత నాగరికతలో స్త్రీ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా అక్షరాష్యులు అవుతారని అంటున్నాం

నిజంగానే స్త్రీలు చలా మంది ఈ రోజుల్లో చదువుకుంటున్నారు. అన్నిరంగాల్లో స్త్రీలు తనదైన ముద్రను వేసుకొని సమాజంలో ముందుకు వెళ్తున్నారు.

ఇంకా కొంతమంది స్త్రీలు TVల వచ్చే సీరియెల్స్ చూస్తూ కొంత మంది మంచిని గ్రహించి  మారుతున్నారు. మరికోంతమాది చెదను గ్రహించి ప్రక్క దోవ పట్టేవారు. “ఎ వరి పిచ్చి వారికి అనందం” అన్నట్లుగా వ్యవహరిస్తూ తమ భర్త చెప్పే మాటలను సైతం వినక తమకు నచ్చిన రీతిగా ప్రవర్తిస్తూ తమ జీవితాలను ఎడారులుగా మార్చుకుంటూ తమ పిల్లల భవిష్యత్తును కూడా మరిచి వారి ఎంజాయ్ కోసం వారు ఎంతగా తెగిస్తూన్నారో మనం సమాజంలో చూస్తున్నాము. చాల మంది Technology పేరుతొ తమ పిల్లలని Software Engineers గా తాయారు చేస్తున్నారు. చాల మంది Computers ముందు చాల సేపు గడపడం వలన నడుంనొప్పి సమస్యలు, అంతేగాకుండా Mobile సిగ్నల్స్ కోసం పట్టణాల్లో నిర్మించే టవర్ల వలన ఈరోజు పశు పక్ష్యాదులు నశించి పోతున్నాయి. టవర్ల ప్రభావం వలన  మరియు తినే ఆహరం వలన కుడా మానవుడు సంసార జీవితానికి పనికిరాకుండా పోతూ సుఖమయిన జీవనాన్ని కొనసాగించలేక పోవుతున్నాడు. చాల మంది నిరంతరం Mobile Phone లను  నిరంతర whatsapp చాటింగ్ ల కోసం చలా రాత్రి వరకు సమయాన్ని వేచ్చించడం వలన తమ యొక్క నిద్రా భంగం చేసుకొని నిద్రలేమితో భాదపడుతూ ఎన్నో అణారోగ్యలకు  గురి అవుతున్నారు.

 

“ ఏదైయిన వాడుకున్న వాళ్లకు వాడుకున్నంత అన్నట్లు”

ఎవరైనా సరే పాజిటివ్ దృక్పదం తో Technology ఎంత వరకు అవసరమో మన సమయాన్ని వృధా చేయకుండా వాడుకోవాలి. ప్రస్తుత రోజుల్లో దిజిటలైజేసన్ లో భాగంగా చలా మంది డబ్బుల వాడకం అనేది Phone లనుండి Transfer అవుతుంది, చైనా తన అత్యద్బుతమైన  టెక్నోలాజితో  10 రోజుల్లో 1000 పాడుకల ఆస్పత్రిని నిర్మించిందంటే మన  Technology ఎంత అభివృద్ధి పథంలో ముందుకు వెల్తుందో మనం గమనించాలి.

 

విద్యార్థులు మరియు చిన్నపిల్లలు   Folkman మరియు PUBG గేమ్ లాంటి ఆటలతో తమ ఆటలతో తమ ఆరోగ్యాలను,జీవితాలను నాశనం చేసుకున్తన్నారు. ఈరోజుల్లో మోసగాళ్ళు ఇతరులు ATM ల నుండి డబ్బును  Technology సహాయంతో దొంగిలిస్తున్నారు. కావున Technology ని ఎవరైతే తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటే వాళ్ళే జీవితంలో హీరోలుగా ఉంటారు. కావున ప్రతి మనిషి వాడుకునే దాన్ని బట్టి సాంకేతికజ్ఞానం మనుషులకు    దూరం, దగ్గర అని చెప్పవచ్చునని నా యొక్క అభిప్రాయం.

“యద్భావం  తద్బావతి” అన్నట్లు ఎప్పటి కైన ప్రతివ్యక్తి, యువత, విద్యార్ధి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు తమకు అవసరం ఉన్నంత మాత్రమే Technology ని ఉపయోగించుకోవాలి మరియు అభివృధి చెందాలి. అంతే గాకుండా Technology ని ఇష్టం వచ్చినట్లు  ఉపయోగిస్తే భారి మూల్యం చెల్లించక తప్పదు.

Technology సహాయంతో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు, కొంతమంది మంచి బిజినెస్ దారులుగా, మంచి వక్తలు గా, ఉపన్యాసకులుగా, రాజకీయ నాయకులుగా, సైంటిస్ట్ గా, డాక్టర్ లుగా, ఇంజనీర్లవలె అనేక రంగాలలో అభివృధి చెందినవారు ఉన్నారు. కాలం ఎంతో విలువ అయినది. కావున ఆ కాలాన్ని Technology సహాయం తో సద్వినియోగం చేసుకొని దగ్గర కావలె కాని దూరం కాకూడదు. Technology ని నిరుపయోగం చేయకూడదు.

 

Feture image by Jelleke Vanooteghem on Unsplash

Related Posts