నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం పుస్తక సమీక్ష – గోపాల్ వీరనాల

భౌతిక శాస్త్రం (Physics) అనగానే ప్రమాణాలు, సిద్దాంతాలు, సమీకరణాలు గుర్తుకొస్తాయి ఎవరికైనా, అయితే ఈ పుస్తకం “నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం” చూస్తే మాత్రం అలా అనిపించదు, ఒక కొత్త ప్రపంచంలో కి  వెళ్ళిన అనుభూతి కలుగుతుంది, నిజంగా ఇదొక ఒక అద్బుతమైన పుస్తకం,

యెకొవ్ పెరల్మాన్    చేత  1913 లో రచింపబడిన రష్యన్ పుస్తకానికి తెలుగు అనువాదమే నిత్య జీవితం లో భౌతిక శాస్త్రం, దీనిని తెలుగులోకి  శ్రీ డా. కె. బి . గోపాలం గారు అనువదించారు.

నా చిన్ననాటి రోజులలో 5వ తరగతి లో ఉండగా అనుకుంటా,  మా నాన్న గారు రైల్వే స్టేషన్ నుండి రష్యన్ పుస్తకాల తెలుగు అనువాదాలు తీసుకొచ్చే వారు, అవి మాస పత్రికలు గా ఉండేవి, అయితే అందులో భౌతిక శాస్త్రానికి సంబంధించిన చాలా విషయాలు, ఒక కథాలా చెప్పబడేవి, అయితే ఈ పుస్తకాన్ని చూసునప్పుడు అప్పుడు చదివిన ఆ కథనాలు గుర్తుకొచ్చాయి, బహుశా ఇందులోనుండే అవి తీసుకొని ఉండవచ్చు.

అయితే ఒక ప్రశ్న తో ప్రారంభమయ్యే ప్రతీ అధ్యాయం మనలో ఉత్సుకతను పెంచుతూ, ఆధ్యాంతం చదివేలా చ్చేస్తాయి,  మనల్ని చిన్న పిల్లల్ని చ్చేస్తాయి, మనం రోజూ చూసే చాలా విషయాల్లో మనకి తెలియని అద్భుతమైన విషాయాలు దాగి ఉన్నాయనే నిజం ప్రతి అధ్యాయం లో కనిపిస్తుంది, ఒక్కో సందర్బంలో ఆ అద్భుత విషయాలు మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ, ఒక కొత్త విషయాన్ని కనుగొన్నాను అని సంతోషం లో మనల్ని ఎగిరి గంతులేసేలా చేస్తాయి.

పుస్తక ప్రారంభం లో నే “మనం ఎంత వేగం గా కదులుతున్నాం?”  ఒక చిన్న ప్రశ్న తో మన  లో  కొత్త సందేహం కలుగుతుంది,  వేరు వేరు వస్తువులు ఎంత వేగంగా కదులుతున్నాయి, అని ఒకదాని తో ఒకటి పోల్చినప్పుడు అవునా నిజంగానా అనిపిస్తుంది,

అదే సమయం లో మనం కాలానికి ఎదురుగా, ఒక దిశలో, ఒక వేగం తో కదిలితే అసలు సూర్యాస్తమాన్ని చూడము అంటూ,  మార్క్ ట్వేయిన్ రాసిన ఇన్నోసెంట్స్ అబ్రాడ్ అనే పుస్తకం లోని ఒక విషయాన్ని చెప్తూ,

మార్క్ ట్వేయిన్ రాసిన ఇన్నోసెంట్స్ అబ్రాడ్ అనే పుస్తకం లో ఇటువంటి విషయాన్ని గురించి చెబుతాడు. అట్టాంటిక్‌ సముద్రంలో న్యూయార్క్‌
నుండి అజోర్స్‌ ద్వీపాలకు పయనిస్తున్నప్పడు “ఎండా కాలపు వాతావరణం హాయిగా ఉండేది. రాత్రులు మరింత ఆహ్లాదకరంగా ఉండేవి. ప్రతి రాత్రీ నిండు చంద్రుడు ఒకే సమయానిక్కి అదేచోట అకాశంలో దర్శనమివ్వడమనే వింత పరిస్థితిని మేము చూచాము. చంద్రుని ఈ వింత ప్రవర్తనకు గల కారణం మాకు ముందుగా తోచలేదు, అయితే మేము తూర్పు దిశగా చాలావేగంగా ప్రయాణిస్తున్నామన్న విషయాన్ని గమనించిన తర్వాత మా కాలమానానికి రోజుకు 20 నిమిషాలు అదనంగా కలుస్తున్నాయని అర్ధమయింది. అంటే చం ద్రుడు ఒకే చోట కనిపించడానికి అవసరమయిన వేగంతో కాదులుతున్నామని అర్థం ”

 

ఇది నిజంగా అద్భుతంగా తోస్తుంది, మన వేగం దిశ బట్టి సూర్యుడు లేదా చంద్రుడి స్థానాన్ని ఒకే చూసే అవకాశం ఉందని తెలియగానే అవునా మనం చేసి చూడాలి అనిపిస్తుంది,

ఇదే అధ్యాయంలో మరొక అద్భుత విషయం – స్లో మోషన్ కెమెరా పనిచేసే విధానానికి నిదర్శనం లా హెచ్‌.జి. వెల్స్‌ రాసిన వుస్తకం న్యూ అక్సలరేటర్‌”  గురించి చెప్తూ

 

మామూలుగా చెప్పాలంటే మనం నిజంగా ఈ రకంగా మానసిక చిత్రీకరణచేయగలిగితే. మన చుట్టూగల ప్రపంచం మరో రకంగా కనబడుతుంది. హెచ్‌.జి. వెల్స్‌ తన వుస్తకం “న్యూ అక్సలరేటర్‌ లో రాసుకున్న వింత విషయాలన్నీ మనం చూడగలుగుతాం.

ఈ కథలోని మనిషి ఒక వింత పానీయాన్ని తాగుతాడు.అప్పుడతనికి ‘వేగమయిన కదలికలన్నీ స్థిరమయిన దృశ్యాలుగా కనబడనారంభిస్తాయి,
అవెలాగుంటాయో చూడండి:

“కిటికీ ముందు. తెర ఈ రకంగా ఉండగా ఎప్పుడయినా చూశావా?”

“నేనూ అతను చూస్తున్న వేపు చూశాను. కిటికీ తెర అంచు, గాలికి ఎగురుతున్నట్లు మధ్యలో మడతపడి నిశ్చలంగా నిలబడింది”.
“నిజమే! ఇది చాలా విచితం!”

“ఇటుచూడు!” అన్నాడతను. చేతిలో పట్టుకున్న గ్లాసును వదిలేశాడు. సహజంగానే నేను ఉలిక్కిపడ్డాను. గ్లాసు కిందపడి బద్దలవుతుందనుకున్నాను. పగలడం కాదు కదా, అది కనీసం ఉన్నచోట నుండి కదలను కూడా లేదు, గ్లాసు గాలిలో స్థిరంగా నిలిచి ఉంది. 
“మొరటుగా చెప్పాలంటే ఈ అక్షాంశాలలో వస్తువులు సెకండుకు 16 అడుగులచొప్పన కిందపడతాయి.. ఈ గ్లాసు అదే వేగంతో కిందపడుతున్నది. అయితే సెకండులో వందవ వంతు కాలంలో అది కిందపడకపోవడం నీవు చూడగలుగుతున్నావు.

అవును ఒక నిర్ధిష్ట వేగం తో మన కను రెప్పలని కదిలించగలిగితే స్లో మోషన్ ( అంటే  కాలాన్ని ఆపినట్లుగా ఉండే ) అద్భుత దృశ్యాన్ని మనం చూడగలం. మీరెప్పుడైనా ప్రయత్నించారా? మనం ప్రస్తుతం క్రికెట్ మ్యాచ్ లో రివ్యూ చేసే సమయం లో బంతి ఎలా కదిలిందో చూపించే సమయం లో, లేదా బ్యాట్స్ మెన్ కదలికలను చూపించే సమయం లో సెకందులో వెయ్యవవంతు కదళికను కూడా చూడ గలుగుతాము, అది స్లో మోషన్ కెమెరా ల తో సాధ్యమౌతుంది, ఈ విషయాన్ని ఊహించని హెచ్ జి వెల్స్ తన జీవిత కాలం లో నే ఈ అద్భుతాన్ని చూశాడానే విషయాన్ని రచయిత తెలియజేస్తాడు.

ఇవే కాకుండా,

మనం సూర్యునిచుట్టు వేగంగా ఎప్పుడు కదులుతాం?
బండి – చక్రం చిక్కు ప్రశ్న
చక్రంలో అన్నింటికన్నా నెమ్మదిగా కదిలే భాగం
కదిలే కారులోంచి దూకడం ఎలా?
తుపాకీ గుండును పట్టుకోవడం
క్రిందపడుతున్న వస్తువు బరువెంత?
భూమి నుంచి చంద్రుడికి
వస్తువుల బరువు ఎక్కడ ఎక్కువ?
క్రిందపడుతున్న వస్తువు బరువెంత?
మీకోటు మీకు వెచ్చదనాన్ని ఇస్తుందా?
దీపం మంటచుట్టూ గాజు బుడ్డీ ఎందుకు?
తేనెటీగలు ఎందుకు రొదచేస్తాయి?
ఉడికిన గుడ్డుకు వచ్చిగుడ్డుకు తేడా కనుగొనడం ఎలా?
సీసం గుండ్లు గుండ్రంగా ఎందుకుంటాయి

 

ఇలా చిన్న చిన్న ప్రశ్నల తో ప్రారంభించి, చాలా చిక్కు ముడి లా అనిపించే విషయాన్ని కూడా కొన్ని ఉదాహరణలు, కొందరు రచయితల సైన్స్ ఫిక్షన్ లతో పోల్చుతూ సులభంగా అర్థమయ్యేలా చేస్తాడు రచయిత, ఇలా ప్రతి వాక్యం పూర్తవుతుంటే,   నిజంగా ఒక విషయాన్ని ఇంత సులభంగా చెప్పవచ్చా అని పిస్తుంది,

అంతే  కాకుండా ,

 

చంద్రుడి వద్దకు ప్రయాణం
తప్పుడు తక్కెడతో కూడా సరయిన తూకం చేయవచ్చు
అనుకున్న దానికన్నా ఎక్కువ బలం
సూదిగా ఉండే వస్తువులు ఎందుకు కుచ్చుకుంటాయి?
రాతితో మెత్తని పరుపు
భ్రమణం – “నిరంతరం” తిరిగే యంత్రాలు:
మోసపోయిన మొక్క
నిరంతర చలన యంత్రాలు, (శాశ్వత చలన యంత్రాలు)
కొన్ని నిరంతర చలన యంత్రాలు
‘పీటర్‌ ది గ్రేట్‌” “కొనదలుచుకున్న శాశ్వత చలన యంత్రం”
చెవులు చేసే మోసాలు

 

 

ఇలా రకాల శీర్షిక ల తో

 • వేగం – చలనం,
 • గురుత్వాకర్షణ, బరువు, తులాదండాలు, ఒత్తిడి,
 • వాతావరణ అవరోధం
 • భ్రమణం – నిరతరం తిరిగే యంత్రాలు
 • ద్రవాలు, వాయువుల లక్షణాలు
 • ఉష్ణం
 • కాంతి
 • పరావర్తనం, వక్రీభవనం
 • దృష్టి
 • ధ్వని వినికిడి

మొదలైన అంశాలను గురించి చెప్పడం జరిగినది

ప్రతి అంశం కూడా ఒక చక్కని కథాలా, మనల్ని అందులోకి తీసుకెళ్తూ, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించామనే భావనని కలిగిస్తుంది, పుస్తకామంతా ఒక్క సారి చదవనవసరం లేదు, అలాగని ఒక క్రమం లో చదవనవసరం కూడా లేదు, ఎప్పుడైనా సమయం దొరికినపుడు పుస్తకం తీసుకుని ఏదో ఒక పేజీ తెరిచి చదవనారంభించ వచ్చు, మనకు ఏ మాత్రం ఇబ్బంది కలుగకుండా అలాగే చదవలనే భావన కలుగుతుంది, నిజంగా ఇది రచయిత రచనా శైలికి ఒక నిదర్శనం.

యెకొవ్ పెరల్మాన్  ఇతర రచనలు , చూడండి పుస్తకం పేరు చూస్తేనే ఎంత అద్భుతంగా ఉంటాయో అనిపిస్తుంది 

 • నిత్య జీవితం లో రసాయన శాస్త్రం,
 • జామెట్రీ ఇన్ ద ఓపెన్ ఏర్,
 • అమేజింగ్ ఎక్సర్పెరమెంట్స్ ఫర్ యంగ్ ఫిసిసిస్ట్స్ ,
 • ఆల్జీబ్రా ఫర్ ఫన్,
 • ఫిజిక్స్ ఎవ్రి వేర్ ,
 • ఆస్ట్రానమీ ఫర్ ఫన్,
 • మెకానిక్స్ ఫర్ ఫన్,
 • ఎంటర్టైనింగ్ ఫిజిక్స్ ప్రాబ్లెమ్స్    మొదలైన పుస్తకాలు చదివితే,   సైన్స్ పుస్తకాలు చదవాలంటే రష్యన్ అనువాదాలు చదవాలనే ఆలోచన మనకు కలుగుతుంది.

మీరు కూడా తప్పక ఈ పుస్తకాన్ని చదివి చూడండి, మీరొక కొత్త ప్రపంచాన్ని చూస్తారు,

మీకు ఈ పుస్తకం కావాలంటే ఈ క్రింది లింకు లేదా ఫోటో క్లిక్ చేసి కొనండి,

https://amzn.to/3ys9l8C

ఆన్లైన్ లో చదవాలనుకుంటే ఈ లింకు క్లిక్ చేయండి Link 

 

మార్కెట్ లో ఒక వేళ ఈ పుస్తకం దొరక పోతే, ఆన్లైన్ లో చదవండి

Online Book Link

Related Posts