నాకు నచ్చిన పుస్తకం పేరు “కోటిన్నొక్కడు”. ఈ పేరు వింటేనే వింతగా అనిపిస్తుంది. ఏమిటి ఇది, కోటికొక్కడు అంటారు కదా మరి ఈ కోటిన్నొక్కడుఏంటి. ఈ విషయం చాలా మందికి తెలుసు కోటికొక్కడు అంటే కోటి మందిలో ఒక్కడు అన్నట్టు అలాగే కోటిన్నొక్కడు అంటే కోటి లో కాకుండా ఒక ప్రత్యేక మనిషి అన్నట్టు.
ఈ పుస్తకం ఒక నవల. దీని రచయిత చేతన వంశీ. రచయిత ఈ పుస్తకం రాయడానికి ముఖ్య ఉద్ధేశం ఏంటో తెలుసా? ఇలాంటి కరోనా సమయంలో అందరిని నవ్వించాలన్నది ఈ పుస్తక రచయిత ఉద్దేశం.ఈ పుస్తకంలో రచాయిత హాస్యాన్ని పండించే విధానం చాలా బాగుంటుంది. ఈ రచయిత శైలి కూడా చాలా బాగుంటుంది. ఈ కథలో చాలా ఊహించని మలుపులు ఉంటాయి. అందుకే ఈ కథ ఉపశీర్షిక “అద్భుతాలు జరుగుతాయి ఈ కథ అందుకు నిదర్శనం.”
ఈ కథ ముఖ్యంగా “కోటి-గోపి” అనే ఇద్దరు బాల్య మిత్రుల గురించి. వారి జీవితాల్లో జరిగిన అద్భుతాల గురించి చెప్పబడుతుంది. ఈ కథలో ఎంత నవ్వు ఉంటుందో మాటలో చెప్పలేను.
ఒక దగ్గ,ర నాకు రచయిత ఒక రచయితనా, లేకుంటే ఒక రసాయనిక శాస్త్రం పండితుడా అన్నది అర్థం కాలేదు. ఎందుకో మీరే కింద ఉన్న భాగాన్ని చదివి తెలుసుకోండి.
నా రూటే… సల్ఫేటూ…
కొందరి మాటలు స్వీటుగా ఉంటాయి, నాలాగ. ఇంకొందరి మాటలు ఘాటుగా ఉంటాయి, కోటిగాని లాగా. కానీ, “మా రసాయనశాస్త్రం నారాయణ సార్ రూటే సల్ఫేటూ” ఆయన ఎంత గమ్మత్తుగా మాట్లాదేవాడంటే-
“అరేయ్ అమోనియం నైట్రేటు? ఎందుకురా ఇవ్వాళ నువ్వు క్లాసుకు లేటూ?”
“బాబూ బోరిక్ ఆసిదూ. కొంచం ఆ బోర్డు తుడిచిపెట్టు నాయనా.”
“పాఠం వినకుండా పదుకుంటావేంట్రా, పొటాషియం పర్మాంగనేటు వెధవా?”
“నియాన్‌లా నీకు నువ్వు ఒంటరిగా కూచోకపోతే, వెళ్లి ఓజోన్‌లా ఓ నలుగురితో కలిసిపోవొచ్చు కద నాన్న!”
“రేపుగనక హోంవర్క్ చేసుకొని రాకపోతే, మీకు ఎండలో ఎలక్ట్రాన్ విన్యాసమేరోయ్!”
..
..
కోటిగాడు అలా ఆర్తనాదాలు పెడుతుంటే ఎంత ఆనందంగా ఉండేదో! అబ్బాబ్బాబ్బా. ఐఐటీలో కాదు కదా, అసలు హైద్రాబాద్ సిటీ బస్సులో సీటు దొరికినప్పుడు కూడా అంత ఆనందం కలుగలేదు. వాహ్. ఏమానందం ఏమానందం! అదికదా పరమానందం బ్రవ్మానందం సదానందం! అందుకే మా నారాయణ సార్‌ను నిత్యం గుర్తుచేసుకున్నా ఆయన రుణం తీర్చుకోలేనేమో… అని ఆనందభాష్పాలు తెచ్చుకుని నవ్వుకుంటున్నప్పుడు ఇందాక సోఫా మీద అమ్మ పెట్టివెళ్లిన ఫోనులో ‘ఆదిత్య వృదయం’ పూర్తయిపోయి, సీను మీద లైట్ వెలిగి సమయం 9:52 A.M అని కనపడుతున్నా గానీ… నాకు కాలంతో పనిలేదన్నట్టుగా, “కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే” అని సుప్రభాతం పాడుతూ ఫోను రింగవడం మొదలెట్టింది.
😊😊😊
చూడండి మొదలు పెడితే, ఆపాలనిపించడం లేదు, అంత అద్బుతంగా ఉంటుంది ఈ నవల, ఇందులో పైన కేవలం రసాయన శాస్త్ర పద ప్రయోగం మాత్రమే కనబడుతుంది, అయితే నవల మొత్తం చదివితే, ప్రతి పదంలో ఒక ప్రయోగం కనిపిస్తుంది, తెలుగే కాదు ఆంగ్లం తో కూడా ఆడుకున్నారు రచయిత, డ్రాగనయ్య , కసాయి కుమార్ ఆహ్హా హా చదువుతుంటే నే మనకు తెలియ కుండానే ముఖంలో నవ్వు ప్రత్యక్షమౌతుంటుంది.
హిందీ టీచర్ పది తలల రావణుడి ఘట్టం కూడా అద్బుతంగా ఉంటుంది, మీరు కడుపుబ్బా నవ్వడం కాయం,
ఇక గోపి స్నేహితుడు కోటిగాడు పెద్దయక్క ఏమయ్యాడో ఆ సస్పెన్స్ ఎలా కొనసాగిందో మీరే చదివి తెలుసుకోండి,నేను కూడా ఇది చదివాక చాలా నవ్వాను.
ఇది కేవలం ఒక్క భాగం మాత్రమే. ఇలాంటివి ఇంకా 60 భాగాలు ఉన్నాయి. అంటే మొత్తం 61 బాగాలు అన్నమాట. ప్రతి భాగం కూడా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది,
అసలు ఆ భాగం శీర్షిక చాలంటే నమ్మండి,
ఉదా. చూడండి,
- చరిత్ర పుటలలో చీమిడి ముక్కోడు 😊,
- కోటిగాని కోటి ఇంకోటి, రోటీ గాని రోటీ మరోటి ,
- వాటీజ్ దిస్? వంకాయ్ పులుస్..
- ఆ ఒక్కటే అడుగుతా,
- 100% లోకల్,
- ఇజ్జత్ కా సవాల్ 😊 వింటుంటేనే వెరైటీ గా లేదూ? వెరైటీ నే కాదు, వంద శాతం హాస్యం దాని తో పాటే మంచి సందేశాన్ని కూడా చూడవచ్చు
ఈ పుస్తకంలో రచయిత హాస్యాని పండిచడం కోసం ఒక సంధర్భం తయారు చేస్తాడు. అందులో వివిధ సామాజిక అంశాలను జోడిస్తూ, సమస్యలను గురించి చెప్పుతూ, అదే సమయం లో ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా చూపే ప్రయత్నం కూడా కనిపిస్తుంది,
ఈ పుస్తకంలో కేవలం హాస్యం మాత్రమే లేదు, దీనితో పాటు చాలా నీతి విలువలు, సమాజంలోని కష్టాలు, మధ్యపానం దాని పర్యవసానం, మధ్యపాన నిషేధం, నేడు మీడియా తీరు, ఇంకా చాలా ఉన్నాయి.
ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఎదగాలంటే, మనం మనల్ని ఎవ్వరితో పోల్చుకొనవసరం లేదని చెప్పే విధానము, కోటి మంది లో ఒక్కడిగా కాకుండా కోటిన్నొక్కడి గా ఎదగాలనే ఒక గొప్ప సందేశాన్నిచ్చే పుస్తకం ఇది,
చివరగా ఒక మాట ఈ పుస్తకం నుంచే అద్భుతాలు జరుగుతాయి”.., జరుగుతాయని మనం నమ్మాలి అంతే.. అద్భుతాలు వాటంతట అవే జరుగుతాయి. ఈ పుస్తకం ఒక అద్భుతం.
అందరు ఆనందంగా నవ్వుకునేలా చేసిన పుస్తకం మీకు నవ్వాలి అని అనిపిచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని చదివి నవ్వుకోండి.
నన్ను నమ్మండి, మీరు పుస్తకాలు చాలా చదివి ఉండవచ్చు, కానీ ఈ రోజుల్లో ఇంత మంచి నవల రాలేదనడం అతిశయోక్తి కాదు, కుటుంబం లోని అందరూ చదివేలా, మంచి హాస్యాన్ని పండించిన రచయితకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశ్యం తోనే ఈ సమీక్ష రాస్తున్నాను.
ఈ పుస్తకం ఇప్పుడు అమెజాన్లో కూడా ఉంది.
కావాలంటే ఈ లింకు క్లిక్ చేసి కొనుక్కోండి https://amzn.to/3dIOW6Y