విద్యార్థుల విజయానికి సోపానాలు
అందరికి నమస్కారం. Smart articles లో భాగంగా నాకు తెలిసిన కొన్ని విషయాలు 5- సోపానాలుగా వ్రాయడం జరిగింది. అవి
1. క్రమశిక్షణ:
మొట్టమొదటగా విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఎవరైనా సరే క్రమశిక్షణ ద్వారా పని చేయడం ద్వారా సులభంగా మరియు కచ్చితంగా విజయం సాధించగలరు. క్రమశిక్షణ ద్వారా విద్యార్థులు ఉపాధ్యాయుల సహాయంతో తాము కోరుకున్న రంగంలో పనిచేస్తు ఉన్నత స్థాయికి ఎదుగుతారు.
2.ఆత్మవిశ్వాసం:
విద్యార్థి దశలో చాలా మంది తమ తోటి వారితో పోల్చుకుంటూ తనలో ఉన్న జ్ఞానాన్ని గుర్తించరు. కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల ఎంతో కష్టమైన పని కూడా చేయగలం.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల మార్కులు, గ్రేడింగులు బట్టి మాత్రమే ప్రోత్సాహించడం కాకుండా వారు తమ పనిలో పాల్గొన్నారన్న ఉత్సాహం కలిగేలా ప్రోత్సహించాలి. దాని వల్ల విద్యార్థులు ఆ సమయంలో అపజయం ఎదురైనా మరొకసారి చేయడం వల్ల గెలవగలం అనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
3.కృషి:
“కష్టపడి పని చేసే వాడికి కరువన్నదే ఉండదు”. చాలా సందర్భాలలో ఈ సామెతను వాడతారు. ఎందుకంటే నిరంతరం సాధన చేస్తే ఎంతటిి కఠిిిన పని కూడా సులభంగా మారుతుంది. కాబట్టి విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో కష్టపడి ముందుకు సాగడం వల్ల ఎంతో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు.
ఏ పని అయినా మొదటగా ప్రతి ఒక్కరూ సమయం ఎక్కువగా తీసుకుంటారు కానీ విజేతలు అది అవలీలగా చేయడానికి కారణం వారు దాని గురించి పదే పదే ఆలోచనలు , వ్యూహాలు చేస్తూ ఉంటారు, అలాగే చాలా ఎక్కువ సార్లు ఇష్టంగా సాధన చేస్తారు.
4.ప్రేరణ:
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఏదో ఒక రూపంలో ప్రేరణ కలిగించే విధంగా వ్యవహరించడం చాలా అవసరం.
చాలా మంది విద్యార్థులు అనేక అనుమానాలు, భయాలు, ఆత్మన్యూనతా భావనలు కలిగి ఉంటారు.
పెద్ద వాళ్ళు వారి భయాలు, అనుమానాలు తొలగించి ఆ పని చేయడంలో వారికి సకారాత్మక ఆలోచనలు కలిగించే ప్రయత్నం చేయాలి. వివిధ రంగాలలో విజయాలు సాధించిన వ్యక్తుల గురించి గొప్పగా చెప్పడం ద్వారా విద్యార్థులు వారిని ప్రేరణగా తీసుకొని, తాము సాధించ తలచిన పనిని ఉత్సాహంగా చేస్తారు. అలాగే తాను కోరుకున్న రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన
వ్యక్తుల జీవిత చరిత్రలు చదవడం వల్ల కూడా ప్రేరణ పొంది విజయాలు సాధిస్తారు.
5.నైపుణ్యం:
విద్యార్థులు విజయాలు సాధించాలంటే తగిన విధంగా నైపుణ్యాలు కలిగి ఉండాలి. తమ బలాలు, బలహీనతలు గుర్తించి, బలహీనతలను ఎక్కువగా కష్టపడడం వలన అవి చాలా వరకు మన విజయానికి సోపానాలుగా మార్చుకోవచ్చు.
?ఈ విధంగా విద్యార్థులు తమ తమ బలాలు, బలహీనతలు, అవసరాలు, ఆశయాలు తెలుసుకుని కష్టపడితే విజయం నీ కోసం ఎదురు వస్తుంది.
? చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్థులు విజయాలు సాధించాలంటే తమకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకుని, దానిని సాధించడానికి అవసరమైన అన్ని మార్గాలను గురించిన అవగాహన కలిగి, పెద్దవాళ్ళు అందించిన ప్రేరణతో, తమ బలాలు,బలహీనతలు గుర్తించి కష్టపడడం వలన విజయం సాధించగలరు.
ధన్యవాదములు ?