దేశాన్ని గణతంత్ర దేశంగా నిలబెట్టడం లో ఒక పౌరుడి పాత్ర by Kv

భారత దేశాన్ని గణతంత్ర దేశం గా నిలుపడం లో పౌరల పాత్ర ను  గురించి చెప్పే ముందు అసలు గణతంత్రం అంటే ఏమిటి? అని చూసినట్లయితే ,

గణ అంటే ప్రజలు తంత్రం అంటే పరిపాలన అని చెప్పుకోవచ్చు, మరి గణతంత్ర దేశంగా నిలపడం అంటే? గణతంత్ర దేశం గా పాలకులు ప్రజల చేత ఎన్నుకోబడాలి  అది ప్రజా పాలన గా ఉండాలి, అంటే ప్రజలు ఏ  విధంగా కోరుకుంటారో అలాంటి పాలన ప్రజలు కోరుకున్న వారినే పాలకులుగా నిలిపి పొందడం  అని చెప్పుకోవచ్చు.

మరి ఒక పౌరుడిగా దేశాన్ని గణతంత్ర దేశంగా నిలబెట్టడం ఎలా? పాలకులను ఓట్లు వేసి గెలిపించడమే నా?  పౌరుల పాత్ర ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తే, కేవలం ఓట్లు వేసి ఎవరినో ఒకరిని ఎన్నుకోవడం మాత్రమే గణతంత్రం కాదు, గణతంత్ర దేశంగా ప్రకటించబడింది కేవలం ఒక పేరు కొరకో లేకుంటే ఒక తంతు కొరకో చేసింది కాదు.

సామాన్య ప్రజలకు కూడా శక్తినిచ్చేదీ గణతంత్రం, ప్రజల భవిష్యత్తు ను వారికి వారే నిర్ణయించు కునే అవకాశాన్ని ఇచ్చేదే గణతంత్రం.  ఒక పౌరుడి కి  తన దేశ పరిస్తితిని, భవిష్యత్తు ని ప్రభావితం చేసే ఒక ఆయుధం గా నిలిచేదే   గణతంత్రం.  మరి ఒక దేశాన్ని గణతంత్ర దేశంగా ఎలా నిలపాలి? అందుకు ఏమి చేయాలి?

ఎప్పుడైనా ఆలోచించారా? గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న రోజు దేశ భక్తి తో పూనకాలు వచ్చే దేశ భక్తులకు అసలు ఆ రోజు ఎందుకు జరుపుకుంటున్నామో తెలుసా? చరిత్ర గురించి లేదా విషయ పరిజ్ఞానం గురించి నేను అనడం లేదు, అది అందరికీ తెలిసిందే, ఒక వేళ తెలియకున్నా పత్రికలోనో, టీవీ లోనో లేక ఎవరి ప్రసంగం లోనో ఆ రోజు ప్రాముఖ్యత మనకు తెలిసే ఉంటుంది, అది ఆ రోజున మన రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, దాన్ని ఎలా రచించారు, అందులో ఏమేమి ఉంటాయి ఇలాంటి విషయాలన్నీ ఎంతో కొంత తెలిసే ఉంటాయి, అయితే ఆ విషయాలన్నీ తెలుసుకోవడం తో ఒక పౌరుడి భాధ్యత పూర్తవుతుందా? ఏమో అవుతుందే మో అనకండి, ఖచ్చితంగా కాదు.

దేశాన్ని పాలించే వారిని ఎన్నికోవడం ఒక హక్కు మాత్రమే కాదు ఒక  భాధ్యత :

గణతంత్ర దేశంగా నిలబెట్టాలంటే కేవలం గణతంత్రం అంటే ఏమిటో తెలుసుకుంటే సరిపోదు, ఒక గణతంత్ర  దేశాన్ని పాలించుకునే అవకాశం పొందిన ఒక పౌరుడికి  ఆ దేశాన్ని పాలించే వారిని ఎన్నికోవడం ఒక హక్కు మాత్రమే కాదు ఒక  ముఖ్యమైన భాధ్యత,

దేశాన్ని గణతంత్ర దేశం గా నిలబెట్టడం కొరకు

  • ఓటు హక్కు పొందిన  ఒక పౌరుడి గా ప్రతి పౌరుడు విధిగా తన ఓటు హక్కు వినియోగించుకోవడం
  • ఎన్నుకునే అధికారం ఉంది కాబట్టి అది కేవలం తన కొరకే కాదు తన ప్రక్క వారి కోసం అలాగే తన తర్వాతి తరాలకోసం కూడా  అని గుర్తుంచుకోవడం
  • ఓటు వేసే సమయం లో తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా శాశ్వత ప్రయోజనాల కోసం ఆలోచించడం
  • ఓటు ని కేవలం ఒకరిని ఓడించడం కొరకే అని అనుకోకుండా మనల్ని మనం గెలిపించుకోవడం కొరకు అని అర్థం చేసుకోవడం అంటే ఓటు ద్వారా ఎన్నుకోబడిన పాలకులు నిజంగా మన మేలు కోరే  వారై, మనకొరకు పాలన కొనసాగించే వారై ఉండే విధంగా ఎన్నుకోవడం
  • మన కు లభించిన ఓటు హక్కు ని కేవలం ఒక వర్గం కోసమో  లేక ఒక వ్యక్తి  కోసమో కాదు అది  అందరి కోసమని ఆ అందరిలో మనం ఒకరమని తెలుసుకోవడం

సూటి గా ఒక్క మాటలో చెప్పాలంటే నీ దేశ భవిష్యత్తు ను నీవు నిర్ణయించడం అంటే నీవు నీ తలరాతను మరియు నీ కుటుంబం తల రాతను రాసుకోవాడమని గుర్తించడం ద్వారా మాత్రమే చేయగలరు.

 

గణతంత్ర దినం  రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే కాదు, రాజ్యాంగం లోకి మనం వచ్చిన రోజు :

గణతంత్ర  దినం అంటే ఇందాకే  చెప్పుకున్నట్లు చరిత్ర లో కేవలం ఒక తేదీ మాత్రమే కాదు , అలాగే గణతంత్ర దినం రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే కాదు, రాజ్యాంగం లోకి మనం వచ్చిన రోజు.

రాజ్యాంగం లో ప్రతి ఒక్క వాక్యానికి బాధ్యులుగా మనల్ని నిలబెట్టిన రోజే గణతంత్ర దినం, ఆ రోజున జాతీయ పతాక ను ఎగర వేసి, వందనం చేసి భారత మాట కు జై  చెప్పగానే మన వంతు దేశ భక్తి కార్యక్రమం ముగిసిందని మురిసి పోయే వారు ఒక్క నిముషం ఆలోచించాల్సిన అవసరం ఎంతో ఉంది.

రాజ్యాంగం అమలులోకి వచ్చింది అంటే,

  • రాజ్యాంగం లో ఇవ్వబడిన హక్కులను పొందే అవకాశం మనకు వచ్చింది అలాగే
  • రాజ్యాంగం లో చెప్పబడిన బాధ్యతలు కూడా మనం నిర్వహించాల్సిన అవసరం ఉంది
  • అలాగే రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడం

రాజ్యాంగం గురించి చెప్పుకున్నప్పుడు, రాజ్యాంగ గొప్ప వాళ్ళకే అర్థమయ్యే విషయం అని అందులో చెప్పబడిన

సార్వభౌమత్వం, సామ్యవాదం,లౌకికతత్వం, ప్రజాస్వామ్యం మరియు సామాజిక ఆశయాలైన న్యాయం, రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం

మొదలైన పదాలన్నీ మేధావుల కు మాత్రమే అర్థ మయ్యే చాలా పెద్ద పదాలు గా కనిపించ వచ్చు, కానీ జాగ్రతగా పరిశీలిస్తే ఇవేవీ కేవలం మేధావులో లేక అధికారం లో ఉన్న వారి గురించి మాత్రమే చెప్పబడినవి కావు అలాగే చాలా పెద్ద పెద్ద పనుల తో మాత్రమే సాధ్యమయ్యేవి కావు,

మనం ప్రతి రోజు చేసే ప్రతి పని లో అంతర్లీనంగా ఉన్నవే రాజ్యాంగంలో చెప్పబడిన అంశాలన్నీ,

రాజ్యాంగాన్ని పాటించడం అంటే అన్నీ అధ్యాయాలలన్నీ చదివి గొప్ప గొప్ప వారి తో చర్చించి, గొప్ప గొప్ప పనులు చేయడం మాత్రమే కాదు, మనకు మనం ఏర్పరచుకున్న రాజ్యాంగం లో చెప్పబడినట్లు గా మన హక్కులను పొందడం తో పాటు, మనం చేసే చిన్న చిన్న పనులలో మన బాధ్యతలను, విధులను సక్రమంగా నిర్వర్తిస్తే చాలు రాజ్యాంగం దానంతటదే అమలులోకి వస్తుంది,

నీవు రోజు చేసే పనిలో రాజ్యాంగం లోని అంశాలన్నీ పదాలన్నీ ఎక్కడా కంపించవే, మరి రాజ్యాంగం లోని అంశాలని ఎలా పాటించాలి? అని ఆలోచించారా?

అది తెలుసుకోవాలంటే, రాజ్యాంగం అంటే ఏమిటో చూద్దాం,

మామూలు మాటల్లో చెప్పాలంటే రాజ్యాంగం అంటే మనం పొందాల్సిన అవకాశాలను ఎలా పొందాలి , మనం చేయాల్సిన పనులను ఎలా చేయాలి అని తెలుపడానికి ఏర్పరుచుకున్న నియమాలు గా చెప్పుకోవచ్చు,

అంటే ఇప్పుడు నియమాలు అనే పదాన్ని గురించి ఆలోచించండి, మనకు ప్రతి రోజు చేసే పనుల్లో ఏవైనా నియమాలు ఏర్పరచబడ్డాయా?  అవి ఏమిటి? అవి ఎన్ని మనం పాటిస్తున్నాం? ఆ నియమాలు ఏ రూపంలో ఉంటాయి ?

ఆలోచిస్తే

రాజ్యాంగాన్ని పాటించడం అంటే గొప్ప గొప్ప పనులు చేయడం కాదు, కేవలం నీ బాధ్యతలను నీవు నిర్వర్తించడం, నీ విధులను నీవు సక్రమంగా నిర్వర్తించడం :

రాజ్యాంగలో చెప్పబడినట్లు ఆ పదాలన్నీ కనిపించక పోవచ్చు కానీ చిన్న అవి చాలా చిన్న విషయాలు, నియమాలంటే మనరోజు వారీ కార్య క్రమాలలో ఏది చేయాలి ఏది చేయకూడదు  అని చెప్పేవి గా ఉండవచ్చు, ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే రెడ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఆగాలి అనే ఒక చిన్న నియమం ఉంది, మరి నియమం అంటే ఇదేనా? ఎప్పుడైనా ఆలోచించారా? రాజ్యాంగానికి దీనికి ఏమైనా సంభంధం ఉందా?

ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పవచ్చు,

అంటే రెడ్ సిగ్నల్ దాటవద్దని రాజ్యాంగలో రచించబడిందా?  ఇది ఒక చిన్న ఉదాహరణ గా మాత్రమే చెప్పాను, ఇది రాజ్యాంగలో లేక పోవచ్చు, కానీ రాజ్యాంగలో చెప్పబడిన హక్కులు , బాధ్యతలతో పాటు స్వేచ్చ గురించి కూడా చెప్పబడింది ( స్వేచ్చ అంటే కేవలం మనదే కాదు, ప్రక్కవాళ్ళకి కూడా స్వేచ్చ ఉంటుందని గుర్తించాలి )

మరి అవన్నీ ఎలా చెప్పబడుతున్నాయి మనకు అని చూసినట్లయితే,

రాజ్యాంగాన్ని ఆధారం గా చేసుకునే చట్టాలు రూపొందించ బడుతున్నాయి, అవి కూడా అందరి క్షేమాన్ని, అభివృద్ధిని కోరుకుని ఏర్పరుచుకున్నవే,  ఆ చట్టాలలో చెప్పబడిన చిన్న చిన్న విషయాలు, నియమాల రూపంలో మనకు కనిపిస్తూ ఉంటాయి, అవి రోడ్డు దాటడం దగ్గరి నుండి, దేశాన్ని, దేశ పతాకాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించడం, విధులు సక్రమంగా నిర్వర్తించడం,

ఇలా  వివిధ రూపాలలో చెప్పబడిన నియాయమాలకు అనుగుణంగా నడుచుకోవడమే రాజ్యాంగాన్ని పాటించడం అని   చెప్పుకోవచ్చు,

చిన్న మాటలో చెప్పాలంటే, రాజ్యాంగాన్ని పాటించడం అంటే గొప్ప గొప్ప పనులు చేయడం కాదు, కేవలం నీ బాధ్యతలను నీవు నిర్వర్తించడం, నీ విధులను నీవు సక్రమంగా నిర్వర్తించడం, అలాగే మనకు ఉన్న హక్కులన్నీ ఇతరులకు కూడా ఉంటాయని గుర్తెరిగి అందుకు తగ్గట్టుగా నడుచుకోవడం ఈ చిన్న పనులతో మనం రాజ్యాంగాన్ని అమలు చేయవచ్చు.

ఎప్పుడైతే ఈ చిన్న విషయాలను గుర్తుంచుకుని, ప్రతి ఒక్కరూ అంటే ఒక విద్యార్థి కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, ఒక సాధారణ పౌరుడు కావచ్చు, అందరు కూడా,  వివిధ చట్టాలలో  లో చెప్పబడిన అంశాలను తెలుసుకుంటూ, తన దైనందిన జీవితం లో తనకు ఏర్పర్చబడిన నియమాలను పాటిస్తారో అప్పుడు వారు తప్పకుండా తన దేశం కోసం తన ద్వారా ఏర్పర్చుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసిన వారవుతారు, అప్పుడే ఆ దేశాన్ని గణతంత్ర దేశంగా నిలబెట్టిన వారవుతారు.

Voting Closed !

Related Posts