Positive Side of the Year 2020 by G. Sandhya Rani

కొత్త సంవత్సరాన్ని కొత్త, కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త నియాయమాలతో చాలా కొత్త గా కోరుకుంటూ ఆహ్వానిస్తాము. అలాగే ఈ 2020 ని కూడా ఆహ్వానించాము. కానీ ఆ సంతోషం మున్నాళ్ళ ముచ్చటగా మారింది. ఎలా అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి లాక్ డౌన్ డిసెంబర్ అన్నంతగా.

కానీ ఈ చెడు లో కూడా మంచి లేక పోలేదు. ఇది కొత్త సంవత్సరమే కాదు, కొత్త దశాబ్దం కూడా. ఈ సంవత్సరానికి కొత్త నామకరణం “కరోనా” సంవత్సరం గా మారింది. ఈ కరోనా వల్ల మనిషి జీవితం, జీతం అల్లా కల్లోలమైంది. అయినా సరే దీని ద్వారా మనం ఎంతో కొంత నేర్చుకున్నామనే తెలుస్తుంది.

మనిషికి క్రమశిక్షణ నేర్పింది, పరిశుభ్రత నేర్పింది, సమాజంతో సంబంధాలు కొనసాగిస్తూనే భౌతిక దూరం పాటించాలని చెప్పింది. అంటువ్యాధుల గురించి, రోగ నిరోధక శక్తి గురించి, మనం తినే తిండి గురించి పాఠాలు నేర్పింది.

  • లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తల్లిదండ్రులకు పిల్లలతో, కుటుంబం తో ఎక్కువ సమయం సంతోషంగా గడపడానికి అవకాశం దొరికింది.
  • సినిమా హాల్ లు, షాపింగ్ మాల్ లు, పార్క్ లు, హోటళ్లు ఇవన్నీ కొన్ని రోజులు మూతపడటం వల్ల పాత రోజుల కాలాక్షేపం మళ్ళీ నెమరు వేసుకున్నాం.
  • బయటి తిండి కీ భయపడి ఇంటి భోజనానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చాం.
  • పర్యావరణం లో కూడా చాలా మార్పులే జరిగాయి. కాలుష్య రాహిత్యం గా మారింది.  పర్యావరణ రక్షణకు తోడ్పడింది.
  • మనిషికి పోరాడే శక్తి ని నేర్పింది.
  • ఈజీ మనీ కీ అలవాటు పడ్డ వ్యక్తులకు చెపాటోడ్చి కష్టపడితేనే ఆనందం దక్కుతుందని చెప్పింది.
  • విధి  ఉన్నఫలంగా రోడ్డున పడేస్తే.. బతకడానికి కొత్త దారులు చూపింది.
  • అన్నింటికంటే మించి నీకు నిజమైన మిత్రులేవరో, శత్రులేవరో చెప్పింది.
  • భారత్ ఒక దేశం మాత్రమే కాదని అదొక జీవన విధానమని ప్రపంచానికి ఛాతీ చెప్పింది. మన జీవన విధానం, మన ఆచారాలు, మన యోగా, ధ్యానం గొప్పదనాన్ని తెలిపింది.
  • భారతీయుల శక్తి మనం పడే కష్టంలో, తీసుకునే ఆహారం లోనే ఉందని ప్రపంచ దేశాలకు చెప్పింది.
  • ప్రపంచానికంతటికీ ఒకే సారి జబ్బు చేసినా,భారత్ ఔషదాలను అందించి అడుకోగలదని ఛాతీ చెప్పింది.
  • మన ఆయుర్వేద శక్తిని ప్రపంచానికి పరిచయం చేసింది.

శత్రువులు మారణాయుధాలతో దాడికి తెగబడినా మన సైనికులు వట్టి పిడికిళ్లతోనే మట్టి కరిపించగలరాని ప్రపంచానికి చాటి చెప్పింది.

  • దేశం కోసం మన జవాన్ ఎంతటి త్యాగనికైనా తెగిస్తాడాని గాల్వాన్ ఘటన నిరూపించింది.  ఇండియన్ జవాన్ శక్తి ఏమిటో, రక్షణ పరంగా భారత్ ఎంత బాలమైందో ప్రపంచానికి తెలిసేలా చేసింది.  కుట్రలతో భారత్ ని దెబ్బ తీయాలని చూస్తే రెట్టించిన శక్తి తో పైకి లేస్తుందని శతృదేశాలకు గట్టి హెచ్చరికలు పంపింది.
  • ఇలాంటి గడ్డు పరిస్తితులల్లో కూడా ఎన్నో కొత్త వస్తువుల రూపకల్పనాలు జరిగాయి. ఆన్ లైన్ క్లాసుల ద్వారా విద్య, వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనులను పూర్తి చేశారు.
  • కొన్ని రంగాలకు కొత్త దారులను చూపింది.
  • మారుమూల గ్రామాలకు కూడా సాంకేతిక పాఠాలు నేర్పింది.
  • శానిటైజర్, క్వారంటైన్ పదాలను పరిచయం చేసింది.

జీవితం ఒక సాగరం ఎన్ని కష్టాలు వచ్చినా ఈదుతూ ఒడ్డుకు చేరాల్సిందే. కొత్త సంవత్సరం వస్తే గోడకున్న క్యాలెండర్ మాత్రమే మారుతుంది, మన జీవితం కాదు, అది రోజూలాగే మారుతుంది. అది అలాగే కొనసాగుతుంది.

కష్టం, సుఖం, బాధ, సంతోషం, కోపం, అనారోగ్యం అన్నీ అలాగే వస్తాయి పోతాయి, ఏ సంవత్సరం లో నైనా  మంచి, చెడు రెండూ ఉంటాయి. మంచిని స్వీకరిస్తూ, చెదుని తిరస్కరిస్తూ ముందుకు సాగడమే మన కర్తవ్యం. ఏది జరిగినా అంతా మన మంచికే అనుకుందాం,

అందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

Related Posts